Kamareddy Boy Suicide | కామారెడ్డిలో విషాదం.. ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదహారేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Boy Suicide | ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదహారేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Kamareddy Boy Suicide | ఉస్మాన్​పురాకు చెందిన..

కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఉస్మాన్ పురాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ సిద్ధికి, తన భార్య ఇర్ఫానకు కాలు విరగడంతో శనివారం మధ్యాహ్నం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో ఇంటి వద్ద చిన్న కుమారుడు అబ్దుల్ సమద్ ఒంటరిగా ఉన్నాడు. రాత్రి 8.40 గంటలకు పెద్ద కుమారుడు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్​లో అబ్దుల్ సమద్ ఉరి వేసుకుని ఉన్నాడు.

వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇంటికి చేరుకుని కుమారుడిని ఉరి నుండి దించి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Akulakondur Shivaji Statue | అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ..మాజీ సర్పంచి సహా పలువురిపై కేసు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *