అక్షరటుడే, వెబ్డెస్క్ : Ganesh Festival | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో ఆయన శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలన్నారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Ganesh Festival | మండపాలకు ఉచిత విద్యుత్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. అయితే, నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Kavitha | రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు : కవిత