BRICS Declaration | ఉగ్రవాదంపై కఠిన వైఖరి.. బ్రిక్స్​ న్యూఢిల్లీ డిక్లరేషన్​

పహల్గామ్‌ ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాల అధిపతులు ఖండించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRICS Declaration | పహల్గామ్‌ ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాల అధిపతులు ఖండించారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రాంతీయ కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బ్రిక్స్​ సమ్మిట్​లో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్​ విడుదల చేశారు. ఇందులో పహల్గామ్ (Pahalgam)​ గురించి ప్రస్తావించారు. ఉగ్రవాద చర్యల వెనుక ఉద్దేశ్యం, వాటికి పాల్పడిన వారు ఎవరైనప్పటికీ, అవన్నీ నేరపూరితమైనవి, సమర్థించరానివి అని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

BRICS Declaration | ఉగ్రస్థావరాలపై చర్యలు తీసుకోవాలి

ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, సురక్షిత స్థావరాలపై చర్యలు తీసుకోవాలని బ్రిక్స్​ దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడి పెట్టొద్దన్నారు. ఉగ్రవాద నిరోధంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని బ్రిక్స్ నాయకులు సభ్య దేశాలను కోరారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైనా సమష్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువ తరాలలో తీవ్రవాదం, రాడికలైజేషన్‌ను ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

దీనిని కూడా చదవండి : Protest Duty Guidelines | నిరసనల సమయంలో సంయమనం పాటించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *