అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Clay Ganesh Idols | మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని (Eco Friendly Ganesh) కాపాడుదామని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ (TNGEOS Nizamabad ) జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని(Nizamabad) సంఘం కార్యాలయంలో ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
Clay Ganesh Idols | మట్టి గణపతులనే పూజించాలి
సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఉచితంగా భక్తులకు మట్టి గణపతులను అందజేస్తున్నట్లు తెలిపారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం.5.30కు టీఎన్జీవోస్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, టీఎన్జీవోస్ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేశ్ ఆగమనం