అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Drunk Driving Cases | రూ.కోటికి పైగా జరిమానాలు..
సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పీఎస్ పరిధుల్లో ఆరు వారాల్లో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 1,784 మంది పట్టుబడ్డారన్నారు. వారిని నిజామాబాద్, బోధన్ అర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చగా 124 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించామని తెలిపారు. మిగిలిన వారికి రూ. రూ.కోటికి పైగా జరిమానా వేశామని చెప్పారు. ఈ నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహించి, మొత్తం 1,784 కేసుల నమోదు చేశామన్నారు.
Drunk Driving Cases | కఠిన నిబంధనలు..
ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ పేర్కొన్నారు. వాహనాదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పక తమ వెంట ఉంచుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి లైసెన్స్ ఆర్నెళ్లపాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపి రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్స్ లభించదన్నారు.మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్‌షీట్ నమోదు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: 18 Hours Power Supply | వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి..: దినేష్ కులాచారి