Flood Canal | వరద కాలువ పూడికతీత పనులు ప్రారంభం

కామారెడ్డి పట్టణంలో వరద కాలువ పూడికతీత పనులను మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Flood Canal | గతేడాది ఆగస్టు నెలలో కురిసిన కుంభవృష్టికి కామారెడ్డి(Kamareddy) పట్టణం వరదల్లో చిక్కుకుంది. ముఖ్యంగా పట్టణంలోని జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీలు పూర్తిగా నీట మునిగి వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

Flood Canal | అప్రమత్తమైన మున్సిపాలిటీ..

ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వర్షాకాలానికి ముందే మున్సిపాలిటీ (Kamareddy Municipality) అప్రమత్తమైంది. అందులో భాగంగానే జీఆర్ కాలనీ 8వ వార్డులో వరద కాల్వ పూడికతీత (Flood Canal) పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి బుధవారం ప్రారంభించారు.పూడుకుపోయిన కాల్వను జేసీబీ యంత్రాలతో పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన నష్టం మళ్లీ పునరావృతం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, వరద నీరు, డ్రైనేజీ నీరు సజావుగా వెళ్లేలా కాలనీల వారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు మహేష్, భాను, అంజద్, అన్వర్, బబ్లూ, గణేష్, సత్యం, భూపతి, గంగాధర్‌తో పాటు డీఈ హన్మంతరావు, ఏఈ వేణు, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1212 2

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *