నిజామాబాద్Paddy Transport | కలెక్టర్​ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న అధికారులు

Paddy Transport | కలెక్టర్​ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న అధికారులు

ధాన్యం కొనుగోళ్లపై నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. జిల్లా పౌర సరఫరాల అధికారులు పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Transport | ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. జిల్లా పౌర సరఫరాల అధికారులు గురువారం డొంకేశ్వర్​ సొసైటీ పరిధిలోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

Paddy Transport | మిగిలిపోయిన ధాన్యంపై ఆరా..

జిల్లా పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సీఎస్‌సీ ప్రవీణ్, ఏసీఎస్​వో కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కుడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPCs) పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడంపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ట్యాబ్ ఎంట్రీలను (Tab Entry) సకాలంలో పూర్తి చేయడంతో పాటు ఈనెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.

అలాగే బ్యాక్‌వాటర్‌లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమా పారా బాయిల్డ్ రైస్​మిల్లును సందర్శించి, మిల్లుకు చేరుతున్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ అంగీకార ప్రక్రియ (Miller Acknowledgement)ను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యానికి సూచించారు.

paddy 2

ఇది కూడా చదవండి: Siddaramaiah Resignation | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా .. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...