KTR Grand Welcome | పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద కేటీఆర్‌కు ఘనసన్మానం

ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు​ పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద బీఆర్​ఎస్​ నాయకులు స్వాగతం పలికారు.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా : KTR Grand Welcome | ఆదిలాబాద్ జిల్లా  (Adilabad District) పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ప్రార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు.

KTR Grand Welcome | తరలివచ్చిన కార్యకర్తలు..

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్​ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్​, యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ జెండాలతో, నినాదాలతో నాయకులు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ముచ్చటించిన కేటీఆర్​ స్థానిక హోటల్​లో టీ తాగారు. అనంతరం ఆయన ఆదిలాబాద్​  వెళ్లారు.

ఇది కూడా చదవండి..: Education Department | సర్కారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. అడ్మిషన్​ రిజిస్టర్​ మాయం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *