అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jana Sena Telangana | తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తమకు కార్యకర్తలు ఉన్నారని, వారి కోసం పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్రావు జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
నెల రోజులుగా తెలంగాణ రాజకీయాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ పార్టీ తెలంగాణలో దూకుడు పెంచి కార్యాలయాన్ని సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో పలువురు నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. GHMC మాజీ మేయర్‌గా పనిచేసిన ఓ కీలక నేత జనసేన పార్టీలో చేరుతారని సమాచారం. ఇప్పటికే జనసేన తెలంగాణ ముఖ్య నేతలతో సంప్రదింపులు ప్రారంభమైనట్లు సమాచారం.
Jana Sena Telangana | త్వరలో చేరిక
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జనసేనలో చేరితో హైదరాబాద్‌లో ఆ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా సదరు నేత చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే చేరిక తేదీ ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేసిన ఆయన 2002లో బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పని చేశారు.
Jana Sena Telangana | కాంగ్రెస్‌లో చేరిక

బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన బొంతు రామ్మోహన్ 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం మేయర్ అయ్యారు. అయితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన 2024 ఫిబ్రవరిలో హస్తం గూటికి చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో తాజాగా జనసేనలో చేరుతారని సమాచారం.
ఇది కూడా చదవండి..: Gundla Singaram Eviction | పేదల గుడిసెల తొలగింపు.. హన్మకొండ గుండ్లసింగారంలో ఉద్రిక్తత