Gundla Singaram Eviction | పేదల గుడిసెల తొలగింపు.. హన్మకొండ గుండ్లసింగారంలో ఉద్రిక్తత

హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gundla Singaram Eviction | హన్మకొండ జిల్లా (Hanmakonda District) గుండ్లసింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించారు.

గుండ్ల సింగారం ప్రాంతంలో కొన్నేళ్లుగా పేదలు నివాసం ఉంటున్నారు. అయితే శనివారం తెల్లవారుమున అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడకు చేరుకున్నారు. జేసీబీల సాయంతో గుడిసెలు, షెడ్లను కూల్చవేశారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి స్థానికులు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Gundla Singaram Eviction | 200 మంది పోలీసులతో..

హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సుమారు 200 మంది పోలీసుల బందోబస్తుతో గుండ్ల సింగారం చేరుకున్నారు. అనంతరం గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్​ ఆదేశామ మేరకు గుడిసెలు తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Kavitha Allegations | లంచం అడుగుతున్న డిప్యూటీ సీఎం.. కవిత సంచలన ఆరోపణలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *