తెలంగాణCyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణకు సహకరించాలి : సీపీ సజ్జనార్​

Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణకు సహకరించాలి : సీపీ సజ్జనార్​

సైబర్​ నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించాలని హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషనర్ వీసీ సజ్జనార్​ కోరారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime Control | సైబర్​ నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించాలని హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar)​ కోరారు. మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమన్వయ సమావేశం నిర్వ‌హించాం.

దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్​ నేరాలు (Cyber Fraud) పెరిగిన విషయం తెలిసిందే. నిందితులు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల ఖాతాలను ఖాళీ చేయడానికి మ్యూల్​ అకౌంట్లు తెరుస్తున్నారు. మ్యూల్​ అకౌంట్ హోల్డర్లకు కమీషన్​ ఆశ చూపుతున్నారు. మ్యూల్​ అకౌంట్లు తెరవడంతో పలువురు బ్యాంకు ఉద్యోగులు సైబర్​ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఇటీవల 32 మంది బ్యాంక్​ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ (RBI) రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్తో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ప్ర‌తినిధులతో సీపీ సమావేశం నిర్వహించారు.

Cyber Crime Control | భద్రతకు పెద్దపీట వేయాలి

బ్యాంకు అధికారులు ఖాతాల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని సీపీ సూచించారు. కస్టమర్లు సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలన్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ‘సేఫ్ కస్టమర్ చాలెంజ్’ (Safe Customer Challenge)ను బ్యాంకులు స్వీకరించాలన్నారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ ‘జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Biryani Center Seized | బిర్యానీ సెంటర్​ను సీజ్​ చేసిన అధికారులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...