జాతీయంKashmir Tour Package | భూలోక స్వర్గాన్ని చూసొద్దామా..

Kashmir Tour Package | భూలోక స్వర్గాన్ని చూసొద్దామా..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఈసారి కశ్మీర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kashmir Tour Package | ఇండియన్ రైల్వే (Indian Railways) క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అల్టిమేట్ కాశ్మీర్: ది ప్యారడైజ్ ఆన్ ఎర్త’ పేరుతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో శ్రీనగర్, సోనామార్గ్, గుల్మార్గ్ పహల్గామ్ వంటి ప్రాంతాలను చూసి రావొచ్చు.

ఇది 5 రాత్రులు, 6 పగళ్లు సాగే విమాన యాత్ర. ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విమాన ప్రయాణ ప్యాకేజీ ఆగస్టు 28న గౌహతి నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 2 పర్యటన ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..

శ్రీనగర్ : శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా సవారీ ఉంటుంది. అలాగే మొఘల్ గార్డెన్స్, నిషాత్ బాగ్ వంటి చారిత్రక ఉద్యానవనాలను చూపిస్తారు.

సోనామార్గ్ : దీనిని మంచు పచ్చిక భూమి అని పిలుస్తారు. ఇక్కడి హిమానీనదాలు, ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

గుల్మార్గ్ : పువ్వుల పచ్చిక భూమిగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ (గోండోలా) రైడ్ అందుబాటులో ఉంది.

పహల్గామ్ : అందమైన లోయలు నదీ తీరాలతో అలరారే పహల్గామ్ పర్యటన కూడా ఈ ప్యాకేజీలో భాగం.

Kashmir Tour Package | ప్యాకేజీ వివరాలు..

ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా విమాన ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, స్థానికంగా సందర్శించడానికి రవాణా సౌకర్యాలు కూడా ఈ ప్యాకేజీలో యాడ్ చేశారు.
ముగ్గురు వ్యక్తుల షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ. 34,000.
ఇద్దరు వ్యక్తులు పంచుకుంటే ఒక్కొక్కరికి రూ. 35,350.
ఒక్కరే ప్రయాణిస్తే రూ. 40,210.
5-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు మంచంతో కలిపి రూ. 27,690, మంచం లేకుండా రూ. 25,640.

Kashmir Tour Package | బుకింగ్ ప్రక్రియ:

ఈ ప్యాకేజీలో 20 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న పర్యాటకులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా {కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Trump India Remarks | భారత్‌ను నరకంతో పోలుస్తూ ట్రంప్ పోస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...