అక్షరటుడే వెబ్‌డెస్క్: TMC Name Symbol Freeze | తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కీలక మలుపు తిరిగింది. తృణమూల్ పార్టీ పేరుతో పాటు దాని అధికారిక ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
TMC Name Symbol Freeze | రెండు వర్గాలకు కొత్త పేర్లు..
పార్టీ చీలిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, తాత్కాలిక గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ( Mamata Banerjee ) వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించగా, తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరును, ‘ఎన్వలప్ (కవర్)’ గుర్తును కేటాయించింది.
TMC Name Symbol Freeze | టీఎంసీలో భారీ చీలిక..
రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేలు రిటబ్రత బెనర్జీ వైపు నిలవగా, లోక్‌సభ ఎంపీలు సైతం వేర్వేరుగా చీలిపోయి జాతీయ స్థాయిలో పరిణామాలకు దారితీశారు. దశాబ్దాలుగా ఉన్న తమ పార్టీ పేరు, గుర్తును ఈసీ నిలిపివేయడంపై మమతా వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, తిరుగుబాటు వర్గం మాత్రం ఈ పరిణామాలను స్వాగతించింది. తుది తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నికల్లో ఈ కొత్త గుర్తులపైనే ఇరు వర్గాలు పోటీ పడనున్నాయి.
ఇది కూడా చదవండి: Air India Express Pilots | నలుగురు పైలెట్లను సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్