LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్​.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధరలు

డొమెస్టిక్​​ గ్యాస్ సిలిండర్​ ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం నుంచి రూ.29 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPG Gas Price Hike | దేశంలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం మరోసారి రేట్లు పెరిగాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, గ్యాస్​ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేశవ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నాయి. ఆదివారం గృహ వినియోగ ఎల్​పీజీ (LPG) ధరను సిలిండర్‌కు రూ. 29 చొప్పున పెంచారు. గత మూడు నెలల్లో ఈ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

LPG Gas Price Hike | నష్టాలను భర్తీ చేయడానికి..

ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్​ ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచిన కంపెనీలు తాజాగా డొమెస్టిక్​ సిలిండర్ల (Domestic Cylinders) రేట్లను సైతం పెంచుతున్నాయి. మార్చి 7న సిలిండర్ ధరను రూ. 60 మేర పెంచారు. తాజాగా రూ.29 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

LPG Gas Price Hike | రూ.60 వేల కోట్ల నష్టం

పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం భారత్​లో డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్ల ధరలు పొరుగు దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ, హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ఇంధన రవాణాను కొనసాగించిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది, దీనివల్ల ఏ పెట్రోలియం ఉత్పత్తికీ కొరత ఏర్పడలేదు. గత ఏడాదిలో గృహ వినియోగ ఎల్​పీజీపై మార్కెటింగ్ సంస్థలు సుమారు రూ. 60వేల కోట్ల నష్టాన్ని భరించాయి. అంతర్జాతీయ ముడి చమురు, ఇంధన మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా ప్రభుత్వం ఇప్పటివరకు కొంతమేర ఆ భారాన్ని ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థల ద్వారా తనపైనే వేసుకుంది.

LPG Gas Price Hike | ప్రధాన నగరాల్లో గ్యాస్​ సిలిండర్​ ధరలు

ఢిల్లీ: రూ. 942 (గతంలో రూ. 913), ముంబై: రూ. 941.40, కోల్‌కతా రూ. 968, చెన్నై: రూ. 957.50, పాట్నా: రూ. 1031.50, హైదరాబాద్ రూ. 996, లక్నో: రూ. 980, జైపూర్: రూ. 945.50, బెంగళూరు: రూ. 944.50.

దీనిని కూడా చదవండి : Telugu Youth Murder | అమెరికాలో తెలుగు యువకుడి దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *