ITR Filing Benefits | ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.. ఇలా చేస్తే ప్రయోజనాలెన్నో..

పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోయినా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ITR Filing Benefits | చాలామందికి ఆదాయపు పన్ను పరిమితిలోకి వచ్చేంత ఆదాయం ఉండదు. దీంతో ఐటీ రిటర్న్స్ (IT Returns) దాఖలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. పన్ను పరిధిలోకి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. కానీ పన్ను పరిధిలోకి రాకపోయినా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయి. అవేమిటో తెలుసుకుందామా..

ITR Filing Benefits | ఐటీఆర్ ఫైలింగ్

మీ వేతనం లేదా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన ఆదాయం లేదా ఇతర ఆదాయాలపై అవసరానికి మించి టీడీఎస్ కట్ అయితే.. ఆ మొత్తాన్ని రిఫండ్ రూపంలో తిరిగి పొందడానికి ఐటీఆర్ ఫైలింగ్ అనేది తప్పనిసరి. లేకపోతే ఆ డబ్బును ఇతర ఏ మార్గంలోనూ పొందడానికి అవకాశం ఉండదు.
గృహ నిర్మాణ, వ్యక్తిగత, విద్య, వ్యాపారం.. ఇలా ఏ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా బ్యాంకులు రెండు మÖడేళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతాయి. భవిష్యత్‌లో ఆయా రుణాల అవసరం అవుతాయని భావించేవారు క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి.

విదేశీ ప్రయాణాలకు సంబంధించి వీసాలకోసం దరఖాస్తు చేస్తే.. మీ ఆదాయం, ఫైనాన్సియల్ స్టెబిలిటీని తనిఖీ చేయటానికి కొన్ని దేశాలు ఐటీ రిటర్న్స్ వివరాలు అడుగుతాయి.విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.స్టాక్ మార్కెట్‌లో లేదా ఆస్తులు అమ్మడం ద్వారా లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా వాటిని భవిష్యత్‌లో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం అవసరం.

ఇది కూడా చదవండి..: Mumbai Student Protest | ముంబయిలోనూ విద్యార్థుల మహా నిరసన.. కేంద్ర మంత్రికి రాజీనామా డిమాండ్, పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *