Telugu Youth Murder | అమెరికాలో తెలుగు యువకుడి దారుణ హత్య

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telugu Youth Murder | అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ న్యూయార్క్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

Telugu Youth Murder | తుపాకీతో కాల్పులు

నిన్న అర్ధరాత్రి పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనతో అన్షుల్ కుటుంబ సభ్యులు, స్వగ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Modi Trump Meeting | యుద్ధ సంక్షోభం వేళ మోదీ- ట్రంప్ కీలక భేటీ..?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *