Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Modi Trump Meeting | యుద్ధ సంక్షోభం వేళ మోదీ- ట్రంప్ కీలక భేటీ..?

Shivam nagarani
Last updated: June 3, 2026, 2:33 pm 2:33 pm
Shivam nagarani
Share
Modi Trump Meeting

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Trump Meeting | త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ-7 (G7 Summit) శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఈ ఇద్దరు ప్రపంచ దేశాల అగ్రనేతలు ముఖాముఖి కలవబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Modi Trump Meeting | జూన్ 15 నుంచి జీ-7 సదస్సు..

ఫ్రాన్స్‌లోని ‘ఎవియన్ లే బైన్స్’ వేదికగా జూన్ 15 నుండి 17 వరకు జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సుకు భాగస్వామ్య దేశం హోదాలో భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ సదస్సుకు హాజరవుతారని వైట్‌హౌస్ అధికారుల ఆధారంగా అమెరికా మీడియా వెల్లడించింది.

modhi.1

Modi Trump Meeting | వ్యూహాత్మక చర్చలు..

ఈ అంతర్జాతీయ సదస్సు పక్కన బెట్టి, మోదీ-ట్రంప్ మధ్య ప్రత్యేకంగా ద్విపాక్షిక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇరు దేశాల విదేశాంగ శాఖల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, కీలక వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ భేటీ ఒక గొప్ప అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

modhi.2

Modi Trump Meeting | యుద్ధ సంక్షోభం వేళ కీలక భేటీ..

ప్రస్తుతం పశ్చిమాసియా రీజియన్‌లో ముదురుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ దేశాలను వేధిస్తున్న చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి అంతర్జాతీయ సవాళ్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాగా, గత ఏడాది (2025) ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో చివరిసారిగా డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ భేటీ కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్​

TAGGED:Donald TrumpFrance SummitG7 SummitGlobal Diplomacyindia us relationsInternational Politicslatest newsModi Trump MeetingNarendra Moditelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article KTR Padayatra KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్​
Next Article Bodhan Municipality | Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు.. షాడో ఛైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Patancheru Cylinder Blast
హైదరాబాద్

Patancheru Cylinder Blast | హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. కిలోమీటరు మేర వినిపించిన శబ్దం

By Shivam nagarani
Vizianagaram Incident
ఆంధ్రప్రదేశ్​

Vizianagaram Incident | విజయనగరంలో షాకింగ్ ఘటన.. భార్యపై పెట్రోల్ దాడికి యత్నం, పోలీస్ స్టేషన్‌లోనే హైడ్రామా!

By Srinivas Kolluri
Vijay TVK Victory
జాతీయం

Vijay TVK Victory|తమిళ రాజకీయం ‘విజయ్’మయం.. ద్రావిడ కోటలు బద్ధలు కొట్టిన టీవీకే!

By Shivam nagarani
Wipro Religious Harassment
జాతీయం

Wipro Religious Harassment | మతమార్పిడి రగడ..‘వేధింపులు సహించం’ అంటూ విప్రో వార్నింగ్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.