Ash Gourd Vastu | ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

నర దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని మనలో చాలామంది పెద్దలు చెబుతుంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ash Gourd Vastu | నర దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని  చాలామంది పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత ఎంతవరకు నిజమో తెలియదు కానీ, సమాజంలో దీనిపై బలమైన నమ్మకం ఉంది. మనుషుల కళ్ల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) ఎదుటి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అసూయ వంటి భావాల వల్ల వచ్చే నెగెటివ్ ఎనర్జీ సోకినప్పుడు కొందరిలో తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనినే మనం సాధారణంగా ‘దిష్టి’ అని పిలుస్తాము.

Ash Gourd Vastu | గుమ్మడికాయ ప్రత్యేకత ఏమిటి?

ప్రతికూల శక్తులను తనలో ఇముడ్చుకునే ప్రత్యేక శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంటుందని పండితులు ( Pandits )చెబుతుంటారు. అందుకే కొత్త ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు గుమ్మం ముందు కాశీ గుమ్మడికాయను పగలకొట్టడం, అలాగే సింహద్వారానికి ఎదురుగా బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం ఆచారంగా  వస్తోంది.

Ash Gourd Vastu | నిబంధనలు ఇవే..

నాణ్యమైన బూడిద గుమ్మడికాయను ఎంచుకుని, శాస్త్రోక్తంగా కూష్మాండ పూజ చేయించాలి. పూజ చేసిన ఆ గుమ్మడికాయను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉట్టిలో వేలాడదీయాలి. ఇంట్లో నిత్యం పూజ చేసే సమయంలో ధూపాన్ని ఆ గుమ్మడికాయకు కూడా చూపించాలి. దీనివల్ల దానిలోని శక్తి మరింత పెరుగుతుందని నమ్ముతారు. కేవలం సొంత ఇళ్లలోనే కాకుండా, అద్దె ఇంట్లో ఉండేవారైనా సరే ప్రధాన ద్వారానికి దిష్టి గుమ్మడికాయను కట్టుకోవచ్చు.

Ash Gourd Vastu | ఎప్పుడు మార్చాలి?

ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా.. ఇంటికి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉందని భావించాలి. అలా పాడైన గుమ్మడికాయను వెంటనే తొలగించి, ఆ స్థానంలో కొత్తది కట్టాలి. పాడైన గుమ్మడికాయను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రవహించే నీటిలో కలపాలి. ఇంట్లో మైల పడినప్పుడు, గ్రహణం వచ్చినప్పుడు లేదా ఇంట్లోని అమ్మాయిలు పుష్పవతి అయిన సందర్భాల్లో గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా కచ్చితంగా గుమ్మడికాయను మార్చుకోవాలి.

ఇది కూడా చదవండి: Nizamabad Waterlogged Roads | నగరంలో రహదారులు జలమయం.. 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *