CJP Leaders Summons | సీజేపీ నేతలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ షాక్..!

జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలపడం, జాతీయ జెండా ఎగరవేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలకు ఊరట ఎంతోకాలం నిలవలేదు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CJP Leaders Summons | జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలపడం, జాతీయ జెండా ఎగరవేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతలకు ఊరట ఎంతోకాలం నిలవలేదు. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఢిల్లీ ( Delhi ) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారికి షాకిచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ సీజేపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

CJP Leaders Summons |విచారణకు హాజరుకావాలని ..

సీజేపీ కో-కన్వీనర్లు అయిన సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాతో పాటు, ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులైన అజింక్య షిండేకు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజౌరీ గార్డెన్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.

CJP Leaders Summons | బదిలీ అయిన కేసులు..

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్  రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13న సీజేపీ సభ్యులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే నిరసనల కోసం జంతర్‌ మంతర్‌ను నిర్దేశిత జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో, వారు ప్రైవేటు స్థలంలోకి చొరబడి నిరసన ప్రాంతానికి చేరుకున్నారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నమోదైన రెండు కేసులను ఈ వారంలోనే ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

CJP Leaders Summons | నిన్న విడుదల..

ఈ కేసులో అరెస్టయిన సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా అక్టోబర్ 14 నుంచి తిహార్ జైలులో ఉన్నారు. ఒక్కొక్కరికి రూ. 50,000 పూచీకత్తు, శాంతిభద్రతలను కాపాడతామనే లిఖితపూర్వక హామీ ఆధారంగా మెజిస్ట్రేట్ వారికి ఇటీవల బెయిల్ మంజూరు చేయడంతో వారు నిన్నే జైలు నుంచి విడుదలయ్యారు. కానీ, జైలు నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే క్రైమ్ బ్రాంచ్ నుంచి సమన్లు రావడంతో సీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విచారణ పరిణామాలు ఆ పార్టీ ఉద్యమాన్ని ఎటువైపు మళ్లిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Kanpur Murder Case | యూపీలో దారుణం.. కారుతో ఢీకొట్టి హత్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *