BRICS Security Cooperation | బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారులతో సమావేశమైన ప్రధాని

గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్య అంశాలకు మద్దతు ఇవ్వడం, మరింత సురక్షితమైన, సమ్మిళిత ప్రపంచ నిర్మాణానికి తోడ్పడడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRICS Security Cooperation | బ్రిక్స్ (BRICS) దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులతో సమావేశమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

BRICS Security Cooperation | సహకారం మరింత పెరగాల్సిన అవసరం

ఉగ్రవాదం, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పాటు పలు ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

సమ్మిళిత ప్రపంచ నిర్మాణం

భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆచరణాత్మక సహకారాన్ని ప్రోత్సహించడం, గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్య అంశాలకు మద్దతు ఇవ్వడం, మరింత సురక్షితమైన, సమ్మిళిత ప్రపంచ నిర్మాణానికి తోడ్పడడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో సభ్య దేశాల భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ భద్రతా సవాళ్లపై ఉమ్మడి వ్యూహాలను రూపొందించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *