Crude oil prices | ఆయిల్ ధరలు పడిపోతాయ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Crude oil prices | అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (ఆయిల్) ధరలు భారీగా తగ్గనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు తీపి కబురు అందించారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు.

వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు పేరుకుపోయాయని, దీనివల్ల రానున్న రోజుల్లో చమురు ధరలు ఒక్కసారిగా దిగిరావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Crude oil prices | ఇరాన్‌తో చర్చలు..

ఇరాన్ దేశం చర్చలకు, ఒప్పందానికి సిద్ధంగా ఉందన్న ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఇవి మరింత దిగివచ్చి, సామాన్యుడిపై ఇంధన భారం తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *