NTR Dragon Glimpse | ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గర్జన మొదలు.. ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన‌ ప్రశాంత్ నీల్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NTR Dragon Glimpse | యంగ్ టైగర్ అభిమానుల నిరీక్షణకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Director Prashanth Neel) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఎన్టీఆర్ (Junior NTR) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ వీడియోను విడుదల చేయగా, దాని నిడివి సుమారు 4 నిమిషాల 28 సెకన్లు ఉండటం విశేషం. మే 20న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ గ్లింప్స్‌లో సినిమా ప్రపంచాన్ని, ప్రధాన పాత్రల నేపథ్యాన్ని ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా తారక్ పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేస్తూ కథలోని చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరించారు.

NTR Dragon Glimpse | ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో..

1967 కాలానికి చెందిన నల్లమందు సాగు, మాదకద్రవ్యాల యుద్ధాలు, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీల కార్యకలాపాలు, ప్రమాదకర డ్రగ్ నెట్‌వర్క్‌ల చుట్టూ కథ తిరుగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలో మాదకద్రవ్యాల సాగుకు పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నేపథ్యంతో కథ సాగనున్నట్లు చూపించారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర ద్వారా ఎన్టీఆర్ పాత్ర ఎదుగుదల, అతడి జీవిత ప్రయాణాన్ని పరిచయం చేశారు. ఇందులో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడైన ‘లూగర్’ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఆయన లీన్ అండ్ రఫ్ లుక్, గంభీరమైన బేస్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

NTR Dragon Glimpse | పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు”

“దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే నేను మారిపోతాను. నిద్రలో నేను చంపిన వాళ్ల ముఖాలు నాకు కనిపించవు. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనిపిస్తాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు” అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కథలో విలన్ల ప్రభావం పెరిగిన సమయంలో వారిని అడ్డుకునే వ్యక్తిగా నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ (Anil Kapoor)ను చూపించారు. అలాగే మలయాళ నటుడు బిజు మీనన్, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, గురు సోమసుందరం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఖుష్బు సుందర్, రాజీవ్ కనకాల, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్ జీత్ ఒబెరాయ్, న్టుతుజెలో ప్రిన్స్ గ్రూట్‌బూమ్ తదితరులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.

NTR Dragon Glimpse | ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ ట్రీట్‌

ఈ గ్లింప్స్‌ను బట్టి చూస్తే, ప్రశాంత్ నీల్ ఈసారి 1950–60ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని భారీ స్థాయిలో కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహాలోనే డార్క్ టోన్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎంచుకున్నారు. విజువల్స్ స్టైలిష్‌గా, యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నాయి. అయితే వాటిలో దర్శకుడి గత చిత్రాల ప్రభావం కూడా కనిపిస్తోంది. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భువన్ గౌడా సినిమాటోగ్రఫీ ఈ వీడియోకు ప్రధాన బలంగా నిలిచాయి. మొత్తం మీద నాలుగున్నర నిమిషాల ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ ట్రీట్‌గా మారింది. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని చెప్పవచ్చు. టీ-సిరీస్‌కు చెందిన గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 జూన్ 11న ‘డ్రాగన్’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Peddi Major Twist | ‘పెద్ది’లో అసలు ట్విస్ట్ ఇదేనా?.. ట్రైలర్‌తో కొత్త చర్చకు తెరలేపిన రామ్ చరణ్ పాత్ర!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *