TVK Vijay Alliance | టీవీకే విజయ్​కు మొదలైన ‘పొత్తుల’ సెగ.. ఆ పనిచేస్తే మద్దతుపై పునరాలోచిస్తామన్న సీపీఎం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TVK Vijay Alliance | తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటై వారం రోజులు గడవకముందే విజయ్​కు పొత్తుల తలనొప్పి మొదలైంది. ఏఐఏడీఎంకే రెబెల్ (AIADMK Rebel) వర్గాన్ని కేబినెట్​లో చేర్చుకుంటే విజయ్‌కు ఇచ్చే మద్దతుపై ‘పునఃపరిశీలిస్తామని’ సీపీఎం హెచ్చరించింది.

TVK Vijay Alliance | వారిని కేబినెట్​లోకి తీసుకోవద్దు..

ఏఐఏడీఎంకే రెబెల్ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయిస్తే.. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయమై పునఃపరిశీలిస్తామని సీపీఎం నేత పి.షణ్ముగం ప్రకటించారు. తాజా పరిణామం తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

TVK Vijay Alliance | అందుకే మద్దతు ఇచ్చాం..

షణ్ముగం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని నివారించడానికే వామపక్ష పార్టీలు జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని తెలిపారు. తమిళనాడు మరో తక్షణ ఎన్నికలకు సిద్ధంగా లేదని.. డీఎంకే, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని రెండు కూటములను ఓటర్లు స్పష్టంగా తిరస్కరించారని ఆయన వివరించారు. ఏ పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అతిపెద్ద కూటమిగా టీవీకే ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.

TVK Vijay Alliance | అది ప్రజా తీర్పుకు విరుద్ధం

ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇవ్వడం లేదా వారికి చోటు కల్పించడం ప్రజా తీర్పుకు విరుద్ధమని షణ్ముగం అన్నారు. ప్రభుత్వంలోకి వారిని తీసుకుంటే పారదర్శక పాలన అందిస్తామని టీవీకే ఇచ్చిన వాగ్ధానాన్ని దెబ్బతీస్తుందని నొక్కి చెప్పారు. “టీవీకే వారి చోటు కల్పించే వరకు వెళ్లదని నేను భావిస్తున్నాను. ఒకవేళ మంత్రివర్గంలో ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గానికి చోటు కల్పించే వైఖరి తీసుకుంటే, టీవీకేకు మద్దతు ఇచ్చే తమ వైఖరిని సీపీఐ(ఎం) పునఃపరిశీలిస్తుంది,” అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Medical Shops Bandh | నేడు దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌.. ఆన్‌లైన్‌ ఔషధ విక్రయాలకు వ్యతిరేకంగా కెమిస్టుల నిరసన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *