IPL Points Table | ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో కీలక మార్పులు.. టాప్‌4లో రాజస్థాన్ .. పంజాబ్‌కు షాక్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL Points Table | ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న వేళ ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాజస్థాన్ రాయల్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఫలితం నేరుగా పంజాబ్ కింగ్స్‌పై ప్రభావం చూపించింది.

IPL Points Table | రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానం

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అద్భుత ఆటతీరుతో విజయం సాధించి రెండు కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానం నుంచి నేరుగా నాలుగో స్థానానికి ఎగబాకింది. అంతేకాకుండా జట్టు నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపడింది. ఫలితంగా ఇప్పటి వరకు టాప్-4లో కొనసాగిన పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి పడిపోయింది.

IPL Points Table | నాలుగో స్థానంలో ఎవ‌రు…

ప్లే ఆఫ్స్ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ మార్పు కీలకంగా మారింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో తన అవకాశాలను మరింత బలపరుచుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినట్లు సమాచారం. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం పలు జట్లు తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై సూప‌ర్ కింగ్స్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

అలాగే ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 11 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో మిగిలిన మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ రేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి.

ఇది కూడా చదవండి..: Toss Fixing Rumours | సీఎస్‌కే–ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్ జ‌రిగిందా?.. వైరల్ వీడియో వెనక అసలు నిజం ఇదే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *