SRH vs PBKS | ఎస్​ఆర్​హెచ్​ వీరంగం.. తలొగ్గిన పంజాబ్​ కింగ్స్​!

Naresh Chandan
SRH vs PBKS

అక్షరటుడే, వెబ్​డెస్క్: SRH vs PBKS | ఐపీఎల్ IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. అనూహ్య గెలుపును సొంతం చేసుకున్నారు. పంజాబ్​పై 33 పరుగుల తేడా హైదరాబాద్​ జట్టు భారీ విజయం సొంతం చేసుకుంది.

SRH vs PBKS | టాస్​ గెలిచిన పంజాబ్​..

టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) మెరుపుల ఆరంభాన్ని ఇచ్చారు. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) హాఫ్ సెంచరీలతో పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. చివరగా నితీశ్ (29*) మెరుపులతో అదరగొట్టాడు.

తదుపరి బ్యాటింగ్​ చేపట్టిన పంజాబ్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్లాసెన్​ 43 బాళ్లలో 69 పరుగులు చేశాడు. కిషన్​ 55(32) పరుగులు, ట్రావిస్​ 38(19) పరుగులతో రాణించినా.. ఫలితం లేకుండా పోయింది.

Humanoid Robot Monk | ఆధ్యాత్మిక రంగంలోకి ఏఐ.. దక్షిణ కొరియాలో ‘రోబో సన్యాసి’ అరంగేట్రం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *