అక్షరటుడే, వెబ్‌డెస్క్: Humanoid Robot Monk | సాంకేతికత ఎంత పెరిగినా ఆచార సంప్రదాయాలకు ఇచ్చే గౌరవం తగ్గదని రోబో తయారీ ద్వారా దక్షిణ కొరియా మరోసారి తనదైన శైలిలో నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన ‘గాబీ’ అనే రోబో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Humanoid Robot Monk | బౌద్ధ సన్యాసం ‘దీక్ష’
సియోల్‌లోని జోగ్యే ఆలయంలో బుధవారం (మే 06) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోబోకు బౌద్ధ సంప్రదాయం ప్రకారం ‘దీక్ష’ ఇచ్చారు. 1.3 మీటర్ల ఎత్తు ఉన్న ఈ మరమనిషికి సన్యాసుల వలే కాషాయ వస్త్రాలను అలంకరించారు. దీనికి గాబీ’ (సిద్ధార్థుడి పేరుతోపాటు కరుణ అనే అర్థం వచ్చేలా) అనే పేరును నామకరణం చేశారు.
Humanoid Robot Monk | రోబోల కోసం ‘పంచశీల’ నియమాలు:
సాధారణ సన్యాసులు పాటించే నియమాల తరహాలోనే, ఈ రోబో కోసం కూడా ప్రత్యేకంగా ఐదు నియమాలు (Precepts) రూపొందించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నియమాల రూపకల్పనలో ChatGPT, Gemini వంటి ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల సలహాలను తీసుకున్నారు.
ప్రాణుల పట్ల హింస చూపకూడదు.
ఇతర రోబోలకు లేదా వస్తువులకు నష్టం కలిగించకూడదు.
మనుషుల మాట వినాలి, ఎదురు చెప్పకూడదు.
మోసపూరిత ప్రవర్తన ఉండకూడదు.
శక్తిని ఆదా చేయాలి (అవసరానికి మించి ఛార్జింగ్ చేయకూడదు).
Humanoid Robot Monk | ఏం చేస్తుంది ఈ మర సన్యాసి?
ప్రార్థనలు: రెండు చేతులు జోడించి ప్రార్థనలు చేయగలదు.
ఆచారాలు: ఆలయంలో జరిగే ప్రత్యేక శుద్ధి ప్రక్రియల్లో (Yeonbi) రోబో పాల్గొంటుంది.
ఉత్సవాలు: అతిత్వరలో జరగబోయే ప్రసిద్ధ ‘లోటస్ లాంతర్ ఫెస్టివల్’ (Lotus Lantern Festival) లో ఈ మర సన్యాసి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Humanoid Robot Monk | టెక్నాలజీ ఉద్దేశం
ఆలయ ప్రతినిధుల ప్రకారం.. భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి జీవించే దిశగా ఇది మొదటి అడుగుగా పేర్కొంటున్నారు. ఈ మర సన్యాసి కేవలం యంత్రంలా కాకుండా.. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో, ఆలయ నిర్వహణలో సాయపడేలా తీర్చిదిద్దారు.
చరిత్ర – భవిష్యత్తు కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి దక్షిణ కొరియా ‘గాబీ’ మర సన్యాసి రూపంలో పరిచయం చేసింది. సంప్రదాయబద్ధంగా సాగే ప్రార్థనల మధ్య రోబో “నేను బుద్ధుడికి అంకితమవుతాను” అని చెప్పడం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
Watch! South Korea unveils ‘Gabi’, a humanoid robot monk, at Jogye Temple ahead of Buddha’s Birthday, blending cutting-edge tech with centuries-old Buddhist traditions. #SouthKorea #Robot #Technology #Buddhism #Innovation #IndiaTodayGlobal pic.twitter.com/ZO8XhBq8On
— India Today Global (@ITGGlobal) May 6, 2026
Tamil Nadu Hung Assembly | అన్నా డీఎంకే – డీఎంకే చర్చలు..! ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రత్యర్థులు?

