H-1B Visa Fee | హెచ్​–1బీ వీసాల ఫీజుపై ట్రంప్​కు షాకిచ్చిన కోర్టు

హెచ్‌–1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్‌ కోర్టు నిరాకరించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: H-1B Visa Fee | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​కు ఆ దేశ కోర్టు మరోసారి షాక్​ ఇచ్చింది. హెచ్‌–1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్‌ కోర్టు నిరాకరించింది.

నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు జారీ చేసే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల రుసుమును విధించడాన్ని నిలిపివేస్తూ గతంలో దిగువ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఫెడరల్​ అప్పీల్స్​ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం (యూఎస్​ కాలమానం ప్రకారం) ఆ పిటిషన్​ను తిరస్కరించింది. ఈ రుసుము కాంగ్రెస్ ఆమోదం లేని చట్టవిరుద్ధమైన పన్ను అని పేర్కొంటూ దిగువ కోర్టు నిలిపివేసింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన వ్యాజ్యంలో భాగంగా ఈ తీర్పు వెలువడింది.

H-1B Visa Fee | ట్రంప్​ యంత్రాంగం విఫలం..

దీనిపై స్టే ఇవ్వకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. నష్టం ఏంటో తెలియజేయడంలో ట్రంప్‌ యంత్రాంగం విఫలమయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. కాగా విదేశీ కార్మికులను రప్పించుకోవడానికి సాంకేతిక సంస్థలు ఎక్కువగా ఆధారపడే H-1B వీసాల ఖర్చును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్‌లో ఒక ప్రకటన జారీ చేశారు. హెచ్​–1బీ కింద ఏటా 65 వేల వీసాలు జారీ చేస్తారు. దీని కోసం గతంలో సుమారు 2,000 నుండి 5,000 డాలర్ల వరకు రుసుము చెల్లించేవారు. అయితే ట్రంప్​ దానికి లక్ష డాలర్లకు పెంచడంతో కొత్తగా విదేశీ నిపుణులను నియమించుకోవడనికి కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ఈ క్రమంలో కోర్టు తీర్పుతో కంపెనీలు ఊరటనిచ్చింది. ఈ వీసాలపై ఎక్కువగా భారతీయులు వెళ్తుంటారు. ఈ రుసుము విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి చాలా తక్కువ మంది యజమానులు మాత్రమే దీనిని చెల్లించారు.

ఇది కూడా చదవండి..: Iran US Conflict | బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు..వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *