అంతర్జాతీయంKC-135 Emergency Signal | అమెరికా ఫ్లైయింగ్​ గ్యాస్​ స్టేషన్​ అదృశ్యం.. గల్ఫ్​ ప్రాంతంలో ఘటన!

KC-135 Emergency Signal | అమెరికా ఫ్లైయింగ్​ గ్యాస్​ స్టేషన్​ అదృశ్యం.. గల్ఫ్​ ప్రాంతంలో ఘటన!

పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KC-135 Emergency Signal | అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైందన్న సమాచారం దావానంలా వ్యాపించింది. “ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్”గా పిలవబడే ఈ విమానం గగనతలంలో ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపుతుంది.

KC-135 Emergency Signal | హోర్ముజ్ జలసంధి సమీపంలో

ఫ్లైట్ డేటా ప్రకారం.. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా.. అత్యవసర పరిస్థితిని సూచించే 7700 స్క్వాక్ కోడ్‌ను జారీ చేసింది. అనంతరం విమానం ఎత్తు తగ్గిస్తూ, మార్గాన్ని ఖతార్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే, అత్యవసర సంకేతం ఇచ్చిన సుమారు గంట తర్వాత ఈ విమానం పబ్లిక్ రాడార్ నుంచి పూర్తిగా కనుమరుగైంది.

ప్రస్తుతం ట్రాన్స్‌పాండర్ సిగ్నల్ కోల్పోవడం అనేది విమానం కూలిపోయిందని నిర్ధారించకపోయినా.. ఈ పరిణామాలు తీవ్రమైన ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాలను మాత్రం పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు కనిపించలేదు, రక్షణ చర్యలు ప్రారంభమైనట్లు కూడా సమాచారం లేదు. ఇతర అత్యవసర సంకేతాలు అందినట్టు కూడా ధృవీకరించ లేదు.

పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా స్థిరపడలేదు.

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ వాటాదారులకు లేఖ.. రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలు డీమెర్జర్ ప్రయాణం

వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన వాటాదారులకు రాసిన లేఖలో కంపెనీ...

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలు.. డబుల్ డిజిట్ వృద్ధి నమోదు!

హైదరాబాద్: ప్రముఖ ఎఫ్ఎంసిజి (FMCG) సంస్థ గೋದ్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్...

Tamil Nadu Hung Assembly| తమిళ పీఠంపై విజయ్‌కు బ్రేక్.. మెజార్టీ లేదని పర్మిషన్ ఇవ్వని గవర్నర్!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Hung Assembly|తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు...

15 ఏళ్ల ప్రస్థానం: రూ. 1.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో అరుదైన మైలురాయిని చేరుకున్న ముత్తూట్ ఫైనాన్స్!

భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) అయిన ముత్తూట్ ఫైనాన్స్...