Nepal Floods | నేపాల్‌లో భీకర జలప్రళయం.. గల్లంతైన కేంద్ర మాజీ మంత్రి కోడలు

నేపాల్‌లో సంభవించిన భీకర జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Floods | నేపాల్‌లో సంభవించిన భీకర జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదల కారణంగా మృతుల సంఖ్య 300కు చేరగా, దాదాపు 1,600 మంది వరకు గల్లంతయ్యారు. వీరిలో 288 మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, రహదారులు, వంతెనలు దెబ్బతినడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Nepal Floods | ప్రముఖుల గల్లంతు..

ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు యాత్రికుల జాడ గల్లంతైంది. మాజీ రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్( Mukul Roy ) కుమారుడు శుభ్రాంశు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ ఈ వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. ఆగస్టు 21న టూర్‌లో భాగంగా నేపాల్ వెళ్లిన ఆమెతో.. ఆగస్టు 25 రాత్రి నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండా పోయాయి. అలాగే కోల్‌కతా నుంచి కైలాష్-మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 32 మంది సభ్యుల బృందం (30 మంది పర్యాటకులు, ఇద్దరు టూర్ మేనేజర్లు) కూడా నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువాగఢి వద్ద గల్లంతైంది. బుధవారం ఉదయం ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఉన్న ఆ బృందం నుంచి ఆ తర్వాత భారీ వరదల కారణంగా సంబంధాలు తెగిపోయాయి.

Nepal Floods | భూకంపం కారణంగానే ప్రళయం?

నేపాల్‌లోని మధ్య ప్రాంతాల్లో ఈ విపత్తుకు భూకంపమే కారణమని అధికారులు భావిస్తున్నారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిన మూడు నిమిషాలకే ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ భూకంపం వల్ల హిమనదం నుంచి భారీగా నీరు విడుదలై ఉంటుందని (గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ – GLOF) అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వరదల కారణంగా వందలాది నివాసాలు నీటమునిగాయి, జలవిద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Delimitation Bill | డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు వద్దు: మల్లికార్జున ఖర్గే

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *