అక్షరటుడే, కామారెడ్డి: Smart Ration Card | అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు (Ration Card) అందిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. మాచారెడ్డి (machareddy) మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో గురువారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Smart Ration Card | 15 ఏళ్లుగా రేషన్ కార్డులు లేవు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. గత 15 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు లేక అనేక కుటుంబాలు సంక్షేమ పథకాలు, సబ్సిడీ బియ్యానికి దూరమయ్యాయని, ఆ ఇబ్బందులను తొలగించేందుకే నూతన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ చేపట్టామని చెప్పారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం కోసమే కాదని, అనేక సంక్షేమ పథకాలకు కీలక ఆధారమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఉపయోగపడేలా అనేక పథకాలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి అర్హుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పేద కుటుంబం ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే లక్ష్యమన్నారు.
Smart Ration Card | మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత
కామారెడ్డి నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ నర్సింగ్‌రావు, కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, సర్పంచ్ సంతోష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి నాయక్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, సొసైటీ ఛైర్మన్లు భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్? వేటు తప్పదా? | Revanth Reddy