అక్షరటుడే, ఇందూరు: Har Ghar Tiranga | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని బీజేపీ ఇందూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత అన్నారు. నగరంలోని వీఆన్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేశారు.
Har Ghar Tiranga | 16వ డివిజన్లో..
నగరంలోని 16వ డివిజన్లోని వీఎన్ఆర్ పాఠశాలలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలను విద్యార్థులకు అందజేశారు. ప్రతి ఇంటిపై ఈనెల 15 వరకు జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు ప్రసూన, కల్పె అర్చన, మమత, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు నీలిమ, మహిళా మోర్చా కార్యకర్తలు కీర్తి, స్వరూప పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Sriram Sagar Water Level | శ్రీరాంసాగర్లో 43 టీఎంసీలకు చేరిన నీటిమట్టం