Bheemgal Junior Civil Court | భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం

భీమ్‌గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​భీమ్‌గల్ : Bheemgal Junior Civil Court | జిల్లాలోని భీమ్‌గల్(Bheemgal) మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు’ను ఆదివారం  ప్రారంభించారు. తెలంగాణ  హైకోర్టు( Telangana High Court) న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానాన్ని ప్రారంభించారు.

Bheemgal Junior Civil Court | త్వరితగతిన సేవలు

జస్టిస్ మాధవీ దేవి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వ్యాజ్యదారులకు వేగవంతమైన, సులువైన న్యాయసేవలు అందించేందుకు స్థానికంగా కోర్టుల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు. భీమ్‌గల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై కోర్టు పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, దీనివల్ల సమయంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ​ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్​ భరత లక్ష్మి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చందర్, న్యాయవాదులు చైతన్య, సూర సురేష్, బార్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.

couert2 court1

ఇది కూడా చదవండి: “ప్రహ్లాద్ జోషి తాత్కాలిక విద్యాశాఖ మంత్రి మాత్రమే.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *