Mann Ki Baat | కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ

జీవితంలో కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉండదని, జులై 26 అటువంటి గర్వకారణమైన రోజని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mann Ki Baat |  జీవితంలో కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉండదని, జులై 26 అటువంటి గర్వకారణమైన రోజని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi )వ్యాఖ్యానించారు. ఆదివారం నిర్వహించిన 136వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్గిల్ పోరాటంలో మాతృభూమి రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసిన అమరవీరుల అసాధారణ ధైర్యసాహసాలను స్మరించుకుంటూ, సైనికులకు ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఒక రైడ్, ఒక దేశం, ఒక సెల్యూట్’ అనే నినాదంతో జులై 14న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ప్రారంభమైన బైక్ యాత్ర కార్గిల్ వార్ మెమోరియల్ చేరుకుంటుందని, ఈ యాత్ర వీరుల త్యాగాలను మనకు ఎప్పటికీ గుర్తుచేస్తుందని తెలిపారు.

Mann Ki Baat | మహిళల చారిత్రాత్మక విజయాలు..

మన దేశ యువత క్రీడారంగంలో అనేక అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధాని కొనియాడారు. ఇటీవలే జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన తెలుగు తేజం పి.వి. సింధు విజయాన్ని ప్రశంసిస్తూ, ఆమె సాధించిన గెలుపు పట్ల దేశమంతా గర్విస్తోందన్నారు. అలాగే క్రికెట్ పురిటిగడ్డ అయిన లండన్‌లోని లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన తొలి టెస్టు విజయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

Mann Ki Baat | ఆత్మనిర్భర్ భారత్..

భారత రక్షణ రంగం నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందని మోదీ వివరించారు. కొద్ది రోజుల క్రితమే భారత నావికాదళంలో చేరిన ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ యుద్ధనౌక 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందని, ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇటీవల జరిపిన ‘పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్’ , రెండు రోజుల క్రితం నిర్వహించిన ‘కుషా’ క్షిపణి ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. దీనికితోడు ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం పెద్ద ఒప్పందం కుదిరిందని, భారత రక్షణ సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోదనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Mann Ki Baat | అంతరిక్షంలో యువత అద్భుత విజయం..

భారతీయ అంతరిక్ష రంగం సాధించిన చారిత్రాత్మక క్షణాన్ని దేశ ప్రజలంతా చూశారని మోదీ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ రాకెట్ సాధించిన ఊహకందని విజయం ప్రతి పౌరుడినీ గర్వంతో నింపిందని పేర్కొన్నారు. మన యువ ఆవిష్కర్తలు సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రధాని ఆత్మీయంగా అభినందించారు.

ఇది కూడా చదవండి:  UP Teacher Cashless Scheme | ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం : యూపీ సీఎం యోగి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *