HMDA Chief Engineer | హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HMDA Chief Engineer | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ ( Hyderabad )మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రవీందర్‌ను కోర్టులో హాజరుపరచగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

HMDA Chief Engineer | భారీ అవినీతి..

ఇటీవల ఏసీబీ అధికారులు రవీందర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కలేనన్ని అక్రమ ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు , కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన పదవిని దుర్వినియోగం చేస్తూ రవీందర్ పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. ఈ అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు లభించడంతో అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

hmda.1

HMDA Chief Engineer | తదుపరి దర్యాప్తుపై ఏసీబీ దృష్టి..

ప్రస్తుతం జైలులో ఉన్న రవీందర్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను తమ కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, దీని వెనుక ఉన్న సూత్రధారులెవరు అనే అంశాలపై ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

ఇది కూడా చదవండి:  Tirumala Mock Drill | భక్తుల భద్రతే ధ్యేయంగా.. తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *