Revanth Reddy Review | ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కఠిన ఆదేశాలు

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలని, ఆదాయ సమీకరణలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Review | రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలని, ఆదాయ సమీకరణలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )హెచ్చరించారు. ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పథకాల్లో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక వనరుల పెంపుపై దిశానిర్దేశం చేశారు.

Revanth Reddy Review | ప్రత్యేక నిఘా..

HMDA, TGIIC, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ వంటి కీలక ఆదాయ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆదాయ వనరులను పెంచేందుకు రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసి, నిరంతరం ఫాలోఅప్ చేయాలని స్పష్టం చేశారు. పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించాలని, లబ్ధిదారుల జాబితా ఖరారు నుండి నేరుగా నగదు జమ (DBT) వరకు ప్రక్రియను మరింత సరళీకరించాలని సూచించారు.

revanth.1

Revanth Reddy Review | ప్రాజెక్టుల వేగవంతం..

భవిష్యత్తులో రూపొందించే బడ్జెట్ కేవలం అంకెలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు భూసేకరణ ప్రక్రియకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే, అధికారులు తమ శాఖల వారీగా పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సీఎం హెచ్చరించారు. సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్​గా మార్చారు : సీఎం చంద్రబాబు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *