Hyderabad Police Transfers | భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..30 మందికి స్థానచలనం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Police Transfers హైదరాబాద్ నగర పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు చెందిన 30 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గురువారం (జులై 9, 2026) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశం అనంతరం పరిపాలనాపరమైన కారణాలతో తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బదిలీ అయిన అధికారులు వెంటనే తమ పాత బాధ్యతల నుంచి రిలీవ్ అయి, కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాలని సీపీ ఆదేశించారు.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Hyderabad Police Transfers | బదిలీల వివరాలు..

పంజాగుట్ట ఎస్‌హెచ్‌ఓగా ఇ. జహంగీర్ యాదవ్: ప్రస్తుతం పంజాగుట్ట ఎస్‌హెచ్‌ఓ (SHO) గా ఉన్న ఎం. రామకృష్ణ ఐటీ సెల్‌కు బదిలీ అవ్వగా, సిసిఎస్ (CCS, DD) లో ఉన్న ఇ. జహంగీర్ యాదవ్‌ను పంజాగుట్ట కొత్త ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

సీఎం నివాస భద్రతకు ఎం. మల్లేశం: చిక్కడపల్లి ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఎం. మల్లేశం సీఎం నివాస భద్రతకు (CCC) బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చిల్కలగూడ డీఐగా ఉన్న ఎల్. మధు బాబును చిక్కడపల్లి ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

సైఫాబాద్, అత్తాపూర్ ఎస్‌హెచ్‌ఓల పరస్పర మార్పిడి: సైఫాబాద్ ఎస్‌హెచ్‌ఓ ఎ. సీతయ్య అత్తాపూర్ ఎస్‌హెచ్‌ఓగా, అత్తాపూర్ ఎస్‌హెచ్‌ఓ కె. నాగేశ్వరరావు సైఫాబాద్ ఎస్‌హెచ్‌ఓగా పరస్పరం బదిలీ అయ్యారు.

సచివాలయ భద్రతకు ఆర్‌. గోపి: చాంద్రాయణగుట్ట ఎస్‌హెచ్‌ఓ ఆర్‌. గోపిని సెక్రటేరియట్ సెక్యూరిటీకి బదిలీ చేయగా, స్పెషల్ బ్రాంచ్‌లో ఉన్న ఆర్‌. రవీందర్‌ను చాంద్రాయణగుట్ట కొత్త ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

గాంధీనగర్ ఎస్‌హెచ్‌ఓగా చ. సురేష్ బాబు: స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ చ. సురేష్ బాబు గాంధీనగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎన్. బోస్ కిరణ్‌ను ట్రాఫిక్ అడ్మిన్‌కు బదిలీ చేశారు.

Hyderabad Police Transfers | మరికొన్ని కీలక బదిలీలు..

బి. కిరణ్​ కుమర్​ (వెయిటింగ్​ ఫర్​ పోస్టింగ్​, అటాచ్డ్​ టు అడిషనల్​ సీపీ ఎల్​ అండ్​ వో)ను రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ అవుట్​ పోస్ట్​కు బదిలీ చేశారు.

బి. సత్యనారాయణ (మైలార్‌దేవ్‌పల్లి SHO): ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ. ఆయన స్థానంలో సి. శ్రీనివాస్ మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు.

ఇ. జంగయ్య (ఫలక్‌నుమా SHO): స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ కాగా, ఎం. అప్పల నాయుడు ఫలక్‌నుమా కొత్త ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు.

ఎం. సురేందర్ (బోరబండ SHO): సైబర్ క్రైమ్స్ విభాగానికి బదిలీ అవ్వగా, బి. రవికుమార్ బోరబండ కొత్త ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు.

షేక్ ముజీబ్ ఉర్ రహ్మాన్: సీసీఎస్ నుండి మాదన్నపేట ఎస్‌హెచ్‌ఓగా బదిలీ అయ్యారు.

టి. శ్రీనాథ్ రెడ్డి: స్పెషల్ బ్రాంచ్ నుండి బహదూర్‌పురా ఎస్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *