అక్షరటుడే వెబ్‌డెస్క్: Drunk Drive Karimnagar | కరీంనగర్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు తీవ్రస్థాయిలో చుక్కలు చూపించాడు. కరీంనగర్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెలంగాణ చౌక్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, మద్యం మత్తులో ఉన్న ఒక వాహనదారుడు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పోలీసులు తనను ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయబోగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. పోలీసుల తనిఖీలను అడ్డుకుంటూ నడిరోడ్డుపై హల్చల్ సృష్టించాడు. “అవును.. నేను మందు తాగాను, అవసరమైతే జైలుకైనా వెళ్తా.. నాకేం భయం లేదు” అంటూ పోలీసుల ముందే గట్టిగా కేకలు వేశాడు.
Drunk Drive Karimnagar |సామాన్యులనే టార్గెట్ చేస్తారు..
అంతేకాకుండా పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ.. “మీరెప్పుడూ మాలాంటి సామాన్యులనే టార్గెట్ చేసి పట్టుకుంటారు. పెద్ద పెద్దోళ్లు తాగి తిరుగుతుంటే వారిని ఎందుకు పట్టుకోరు? కేవలం సామాన్య ప్రజలపైనే మీ ప్రతాపమా?” అంటూ పోలీసులను నిలదీశాడు. అక్కడున్న సిబ్బంది ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, కాసేపు రోడ్డుపై తీవ్ర ఉత్కంఠ రేపాడు.

Drunk Drive Karimnagar | చివరికి టెస్ట్ పాజిటివ్..
మందుబాబు ఎంత రగడ చేసినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా.. ఆల్కహాల్ పాయింట్స్ భారీగా నమోదై పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు సదరు వాహనదారుడికి గట్టిగా క్లాస్ పీకి, భారీ జరిమానా (Fine) విధించారు. అనంతరం అతని వాహనాన్ని (బైక్‌ను) సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ చౌక్‌లో జరిగిన ఈ హైడ్రామాను అక్కడున్న స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

“నేను మందు తాగాను, అవసరమైతే జైలుకైనా వెళ్తా
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చుక్కలు చూపించాడు. పోలీసుల తనిఖీలను అడ్డుకుంటూ.. “నేను మందు తాగాను, అవసరమైతే జైలుకైనా వెళ్తా.. కానీ మీరెప్పుడూ మాలాంటి సామాన్యులనే పట్టుకుంటారు,… pic.twitter.com/2KBruS9owy
— ChotaNews App (@ChotaNewsApp) May 29, 2026
ఇది కూడా చదవండి: Ganga Expressway Cracks | మోదీ ప్రారంభించిన రోడ్డు, నెలలోపే పగుళ్లు… అదానీ ఇదేంటి?


