Anthropic Valuation | ట్రిలియన్ డాలర్ల క్లబ్ లో ఆంథ్రోపిక్..!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Anthropic Valuation | అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కంపెనీ ఆంథ్రోపిక్.. సంచలనం సృష్టిస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన ఏఐ టూల్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి.

దీని ప్రభావంతో సాఫ్ట్‌వేర్, లీగల్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో సేవలందిస్తున్న సంప్రదాయ ఐటీ కంపెనీల షేర్లు భారీగా విలువను కోల్పోయాయి. ప్రధానంగా ఈ రంగంలో సేవలందిస్తున్న భారత్‌కు చెందిన కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఆంథ్రోపిక్ మాత్రం మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ పోతూనే ఉంది.

Anthropic Valuation | విపరీతమైన డిమాండ్‌తో…

ఈ ఏడాది ప్రారంభంలో ఆంథ్రోపిక్ కంపెనీ (Anthropic Company) విలువ 380 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అప్పటి నుంచి వేగవంతమైన ఆదాయ వృద్ధి, దాని ఏఐ ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ అయిన క్లాడ్ కోడ్ చుట్టూ ఉన్న ఊపుకు పెట్టుబడిదారులు ముగ్ధులవడంతో సిలికాన్ వ్యాలీ (Silicon Valley)లో ఈ కంపెనీ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానందున పెట్టుబడిదారులలో అత్యధికులు సెకండరీ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ సెకండరీ మార్కెట్‌లో ఆయా కంపెనీలలోని ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు లేదా తొలి పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను అమ్ముతున్నారు.

Anthropic Valuation | పెరుగుతున్న ఏఐ స్టాక్స్..

కృత్రిమ మేధకు సంబంధించిన రంగాల్లోని సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరుగుతోంది. ఇటీవలే చిప్‌ల తయారీ కంపెనీలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ టెక్నాలజీ, ఎస్‌కే హైనిక్స్‌లు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను తాకాయి. ఈ జాబితాలో తాజాగా ఆంథ్రోపిక్ చేరింది. దీనిలో ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సెక్వోయా క్యాపిటల్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. గూగుల్ సంస్థ 40 బిలియన్ డాలర్లు, అమెజాన్ 5 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చినట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ టెక్నాలజీ, ఎస్‌కే హైనిక్స్‌లు కూడా దీని ఇన్వెస్టర్ల జాబితాలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Ganga Expressway Cracks | మోదీ ప్రారంభించిన రోడ్డు, నెలలోపే పగుళ్లు… అదానీ ఇదేంటి?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *