అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | యూఎస్ -ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరుగుతోంది. బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పైనా కనిపిస్తోంది.
Stock Market Today | ఫ్లాట్ గా ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 198 పాయింట్లు తగ్గినా.. అక్కడినుంచి కోలుకుని 310 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఒక పాయింటు నష్టంతో ప్రారంభమై మరో 62 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి 100 పాయింట్లు ఎగబాకింది. ఉదయ 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో 77,689 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 24,269 వద్ద ఉన్నాయి. ఇండెక్స్‌లలో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్‌తోపాటు ఐటీ స్టాక్స్ రాణిస్తుండడంతో మార్కెట్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్స్ లాభాలతో, 14 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా 2.12 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.33 శాతం, రిలయన్స్ 1.18 శాతం, ఎం అండ్ ఎం 1.16 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : అదానీపోర్ట్స్ 3.12 శాతం, ఆసియన్ పెయింట్ 1.62 శాతం, బజాజ్ పిన్‌సర్వ్ 1.12 శాతం, హెచ్యూఎల్ 1.04 శాతం, ఎటర్నల్ 0.96 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: July 30 Gold Prices | ఫెడ్ నిర్ణయంతో బంగారం ధరలపై ఒత్తిడి..దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం