Aug 27 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు ఎక్కువగా లాభపడ్డాయి.
ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) డిస్కౌంట్‌లో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aug 27 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.08 శాతం, ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయాయి. అయితే ఎన్విడియా మరియు ఇతర ప్రధాన టెక్నాలజీ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాల తర్వాత యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.34 శాతం లాభంతో ఉంది.
Aug 27 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.27 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.08 శాతం లాభంతో.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ 0.07 శాతం నష్టంతో ముగిశాయి.
Aug 27 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.94 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.99 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.03 శాతం లాభంతో.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.64 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.37 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.13 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 502 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా పదమÖడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,425 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైసలు బలపడి 95.41 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.26 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.13 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.66 వద్ద ఉన్నాయి.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.17 నుంచి 0.91 కు తగ్గింది.
- విక్స్ 4.6 శాతం తగ్గి 10.56 వద్ద ఉంది. ఇది ఈ ఏడాది జూన్ 7 తర్వాత కనిష్టం.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీల నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.