Stock Market Rally | మూడో రోజూ లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | అమెరికా -ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ (Nifty)లలో బుల్ రన్ మూడో రోజూ కొనసాగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతుండడంతో ముడి చమురు ధరలు అదుపులోకి వస్తుండడం ముఖ్యంగా భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుంది.

దీనికితోడు వరుసగా 13 సెషన్ల పాటు నికర అమ్మకందారులుగా కొనసాగిన ఎఫఐఐలు గత సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా మారారు. రూపాయి విలువ సైతం బలపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆశావహ దృక్పథంతో కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లోనూ ర్యాలీని కొనసాగించాయి.

Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..

Stock Market Rally

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై స్వల్ప ఒడిదుడులకు లోనయినా కోలుకుని పుంజుకున్నాయి. సెన్సెక్స్ 76,443 నుంచి 76,846 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 23,888 నుంచి 24,002 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,989 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,368 కంపెనీలు లాభపడగా 1,886 స్టాక్స్ నష్టపోయాయి. 153 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 113 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 60 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 3.59 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.13 శాతం, ఎన్టీపీసీ 2.10 శాతం, హెచ్యూఎల్ 2.10 శాతం, టీసీఎస్ 1.72 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇండిగో 0.86 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.82 శాతం, మారుతి 0.81 శాతం, టాటా స్టీల్ 0.71 శాతం, బీఈఎల్ 0.51 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Redmi Turbo 5 | పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో రెడ్‌మీ ఫోన్ విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *