బిజినెస్​Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం రెండేళ్లలో ఐదు రెట్ల పెరుగుదల నమోదయ్యింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. తక్షణ రుణ చెల్లింపు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, అతి తక్కువ డాక్యుమెంటేషన్ వంటి కారణాలతో గోల్డ్ లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ ఏడాదిలో డిమాండ్ సంప్రదాయ గ్రామీణ మరియు సెమీ అర్బన్ రుణగ్రహీతలను దాటి పట్టణ నిపుణులు, గిగ్ వర్కర్లు మరియు చిన్న వ్యాపార యజమానులకు విస్తరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో ఆభరణాలపై బ్యాంకు రుణాలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. రెండేళ్ల క్రితం రూ. 93,301 కోట్లుగా ఉన్న రుణాలు.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 4.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Gold Loans | ఏడాదిలో 123 శాతం వృద్ధి ..

సంవత్సర ప్రాతిపదికన చూస్తే గోల్డ్ లోన్స్ కు డిమాండ్ 123 శాతం పెరిగింది. అన్ని రుణ రంగాలలోకెల్లా ఇదే అత్యంత వేగవంతమైనదిగా రికార్డయ్యింది. ఆర్ బీఐ విడుదల చేసిన రంగాల వారీ బ్యాంకు రుణ గణాంకాల ప్రకారం మరే ఇతర రంగంలోనూ మూడంకెల రుణ వృద్ధి నమోదు కాలేదు. ప్రాధాన్యతా రంగ గృహ రుణాలు సంవత్సరం ప్రాతిపదికన 39.8 శాతం వృద్ధితో రూ. 10.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం గృహ రంగం 11.5 శాతం వృద్ధి రేటుతో రూ. 33.56 లక్షల కోట్లకు చేరింది.

బ్యాంకు వ్యక్తిగత రుణాల విభాగం గత ఏడాది 11.7 శాతం వృద్ధిని నమోదు చేయగా ఈ ఏడాది 16.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు రుణాల వార్షిక వృద్ధి రేటు గతంలో 10.4 శాతం నుంచి 15.7 శాతానికి, పరిశ్రమలకు రుణాల వృద్ధి రేటు 8.2 శాతం నుంచి 15 శాతానికి చేరాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వాణిజ్యం మరియు వాణిజ్య రియల్ ఎస్టేట్‌ (Commercial Real Estate)కు బ్యాంకులు అధిక రుణాలు అందించడం వల్ల, సేవల రంగానికి రుణాల వృద్ధి రేటు 12 శాతం నుంచి 19 శాతానికి పెరిగింది.

Gold Loans | ఈ రంగాలు రివర్స్..

పలు రంగాలకు రుణాల విషయంలో రివర్స్ గేర్‌లో వృద్ధి నమోదయ్యింది. వినియోగ వస్తువులు మరియు ఎగుమతి రుణాల విషయంలో బ్యాంకు రుణాలు మందగించడం గమనార్హం. వినియోగ వస్తువుల రుణాలు సంవత్సరం ప్రాతిపదికన 5.3 శాతం తగ్గి రూ. 21,962 కోట్లకు పడిపోయాయి. ఎగుమతుల రుణాల వార్షిక వృద్ధి రేటు 8.4 శాతం తగ్గి రూ. 11436 కోట్లకు తగ్గింది.

ఇది కూడా చదవండి..: Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Attack with Helmet | హెల్మెట్​తో కొట్టిన అల్లుడు.. బైక్​పై నుంచి పడి మహిళ మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack with Helmet | బైక్​పై వెళ్తుండగా వెనుక...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...