బిజినెస్​May 16 Gold Rates | అతివలకు శుభవార్త​.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం...

May 16 Gold Rates | అతివలకు శుభవార్త​.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే!

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ బలపడటం, యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించగా, వెండి ధరల్లోనూ గణనీయమైన పతనం నమోదైంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 16 Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు Silver Prices వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి.

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు (US Debt Securities Yields), అలాగే రూపాయితో పోలిస్తే డాలర్ మరింత బలపడటం కారణంగా విలువైన లోహాల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలు దేశీయ మార్కెట్‌పైనా ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నాయి.

May 16 Gold Rates |

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, నేటి (మే 16) ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,900కు పడిపోయింది.

అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,740గా నమోదైంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.3.05 లక్షలుగా కొనసాగుతోంది.

May 16 Gold Rates | భారీ మార్పులు..

కేవలం హైదరాబాద్‌కే Hyderabad పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,070గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,640కు చేరింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,900 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,740గా నమోదైంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,050 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,890గా ఉంది.

May 16 Gold Rates |

వెండి ధరల Silver Prices విషయంలో కూడా దేశవ్యాప్తంగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.3 లక్షల మార్క్ కంటే దిగువకు చేరడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నిన్నటి ట్రేడింగ్‌తో పోలిస్తే మేలిమి బంగారం ధర రూ.4,420 మేర తగ్గగా, వెండి ధరలో ఏకంగా రూ.10 వేల వరకు కోత నమోదైంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల కంటే ఇతర పెట్టుబడులవైపు మళ్లడం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ల కదలికల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Bengaluru High Speed Rail | నల్లమల మీదుగా హైస్పీడ్​ రైలు.. సర్వే కొలిక్కి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Bengaluru High Speed Rail |...

Chennai Playoff Equations | చెన్నై ప్లే ఆఫ్ ఆశ‌ల‌కు గండి కొట్టిన ల‌క్నో.. మారిన స‌మీక‌ర‌ణాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chennai Playoff Equations | ఐపీఎల్ 2026లో...