April 20 Gold Rates | అక్షయ తృతీయ వేళ.. బంగారం కొనుగోలుదారుల్లో మిశ్రమ స్పందన

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 20 Gold Rates | అక్షయ తృతీయ సందర్భంగా భారీగా తగ్గుతాయని ఆశించిన బంగారం ధరలు స్వల్పంగా మాత్రమే తగ్గడంతో మహిళలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నాయి. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో సందడి అంతగా కనిపించలేదు.

April 20 Gold Rates :

భారతీయ సంప్రదాయంలో ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించడంతో మహిళలు పెద్దఎత్తున కొనుగోళ్లు చేశారు. అయితే, ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని బంగారం ధరలు Gold Rates గణనీయంగా తగ్గుతాయని ఆశించిన వారికి కొంత నిరాశే ఎదురైంది.ఆదివారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు సోమవారం (ఏప్రిల్‌ 20) నాడు కేవలం తులానికి రూ.10 మేర మాత్రమే తగ్గాయి. ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,55,770 వద్ద కొనసాగుతోంది.akshara today .jpggold

April 20 Gold Rates : నిరాశ‌లో కొనుగోలు దారులు..

ప్రధాన నగరాల వారీగా ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,55,770 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,42,790గా ఉంది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్లు: రూ.1,55,920, 22 క్యారెట్లు: రూ.1,42,940, చెన్నైలో 24 క్యారెట్లు: రూ.1,56,650, 22 క్యారెట్లు: రూ.1,43,590గా ట్రేడ్ అయింది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో Hyderabad 10 గ్రాముల వెండి ధర రూ.2,799గా ఉండగా, కిలో ధర రూ.2,79,900 వద్ద ఉంది. ఇతర నగరాల్లో వెండి కిలో ధర సుమారు రూ.2,74,900గా నమోదైంది.

మొత్తంగా చూస్తే, అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు Sales ఊపందుకున్నప్పటికీ, ధరలు గణనీయంగా తగ్గకపోవడం మార్కెట్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. ఇక వచ్చే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు.. ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలే!

ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *