అక్షరటుడే వెబ్‌డెస్క్: Smriti Mandhana Candere | భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన స్మృతి మంధాన ( Smriti Mandhana ), ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆధునిక తరం వినియోగదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో క్యాండెర్ సంస్థ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా నగలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, రోజువారీ జీవనశైలిలో భాగంగా మార్చాలనేదే క్యాండెర్ ప్రధాన ఉద్దేశ్యం.
Smriti Mandhana Candere | యువతకు స్ఫూర్తిగా ..
స్మృతి మంధాన అద్భుతమైన క్రీడా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం , నిజాయితీ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానిస్తున్నామని క్యాండెర్ డైరెక్టర్ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. షారూఖ్ ఖాన్, స్మృతి మంధానలు కలిసి బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లతో అనుబంధం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Smriti Mandhana Candere | నిత్యం ధరించేలా డిజైన్లు..
ప్రస్తుత కాలంలో నగలను కేవలం ప్రత్యేక సందర్భాలకే దాచుకోవాలని ఎవరూ అనుకోవడం లేదు. ఆఫీసు వేర్, క్యాజువల్ అవుటింగ్స్, పండుగలు.. ఇలా ప్రతి సందర్భానికి తగినట్లుగా సింపుల్‌గా, ట్రెండీగా ఉండే నగలకు ఆదరణ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని క్యాండెర్ తన కొత్త కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
Smriti Mandhana Candere | స్మృతి మంధాన ఏమన్నారంటే..
ఈ భాగస్వామ్యంపై స్మృతి మంధాన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. “నాకు నగలు అంటే చాలా ఇష్టం. నేను వాటిని రోజువారీ జీవితంలో భాగంగానే చూస్తాను. నా వ్యక్తిగత శైలికి క్యాండెర్ ఆధునిక డిజైన్లు చాలా చక్కగా సరిపోతాయి. ఇటువంటి బ్రాండ్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని ఆమె వెల్లడించారు.
Smriti Mandhana Candere | విస్తరిస్తున్న క్యాండెర్..
ప్రస్తుతం క్యాండెర్ దేశవ్యాప్తంగా 130 కంటే ఎక్కువ స్టోర్లతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కల్యాణ్ జ్యువెలర్స్ వారసత్వం, ఆధునిక నైపుణ్యం, కస్టమర్లకు నచ్చే డిజైన్లతో ఈ బ్రాండ్ దూసుకుపోతోంది. ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ (ఓమ్నీ-ఛానల్) సేవలను అందిస్తూ, కస్టమర్లకు సులభమైన షాపింగ్ అనుభవాన్ని కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి: Minority Students Education | మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం