అక్షరటుడే వెబ్‌డెస్క్: Kadapa Corona Deaths | ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్, ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో కరోనా లక్షణాలతో బాధపడుతూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా కలకలానికి దారితీసింది. జిల్లాలో ఇటీవల కొందరికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, అదే సమయంలో ఇద్దరు మృతి చెందడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
Kadapa Corona Deaths | ఏం జరిగిందంటే..
కడప నగరం , రాజంపేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులకు కోవిడ్ తరహా లక్షణాలు ఉండటంతో వైద్య శాఖలో ఆందోళన మొదలైంది. పరిస్థితిని గమనించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు.
Kadapa Corona Deaths | పూణేకు నమూనాలు..
ఘటన జరిగిన వెంటనే ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, మృతుల కుటుంబ సభ్యులు , వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే, ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ‘కోవిడ్-19’ లేక మరేదైనా కొత్త రకమైన వైరసా అనేది తేల్చేందుకు, బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపించారు. ఈ మరణాలు , వైరస్ వ్యాప్తిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పూణే ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fatima College | రేవంత్‌రెడ్డి కంటి పరీక్ష చేయించుకోవాలి : కవిత