అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wayanad Landslide | కేరళ (Kerala)లోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నెల 7న భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.
వయనాడ్ జిల్లా, మెప్పాడిలో ఒక ప్రైవేట్ కంపెనీ సొరంగం తవ్వకం పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. గురువారం వరకు కొండచరియల కింద చిక్కుకున్న ఆరుగురు బాధితుల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ఈ ఉదయం (జూలై 10) తిరిగి ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ల్యాండ్ సర్వేయర్ రాజేష్, కన్‌స్ట్రక్షన్ మేనేజర్ విక్రమ్ రాణాల కోసం గాలింపు చర్యలు ఈ ఉదయం నాలుగో రోజుకు చేరుకోగా, బాధితుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం గల్లంతైన మిగిలిన వ్యక్తి కోసం గాలింపులో నిమగ్నమై ఉన్నారు.
Wayanad Landslide | మీనాక్షి నది దిగువన..

కేరళ మంత్రి టి. సిద్ధిక్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌కు చెందిన రాజేష్ మృతదేహం మీనాక్షి నది దిగువన లభ్యమైందన్నారు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారని చెప్పారు. ప్రస్తుతం దానిని తాలూకా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం, మృతదేహాన్ని ఎంబాల్మింగ్ కోసం కాలికట్ మెడికల్ కాలేజీకి తరలిస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని విమానంలో అతని స్వస్థలానికి తరలిస్తామని తెలిపారు. కోజికోడ్ జిల్లాలను అనుసంధానించే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ సొరంగ తవ్వకం ప్రాజెక్టుకు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి..: India Australia Nuclear Deal | అణుశక్తి ఒప్పందంపై సంతకం చేసిన భారత్, ఆస్ట్రేలియా