అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTC Bus Accident | వనపర్తి జిల్లా (Wanaparthy District) పెబ్బేరు సమీపంలో, ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తున్న బస్సు పెబ్బెరు సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
RTC Bus Accident | వ్యాన్ ఢీకొని మహిళ మృతి
విశాఖ నుండి తునివైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఐచర్ వ్యాన్ ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ ఎగిరి వ్యాన్‌పై పడింది. అనంతరం ఆ వ్యాన్ మరో ట్రాలీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన గాయత్రిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar on SIR | ఒక్క ఓటు కూడా పోవద్దు.. ఎస్ఐఆర్పై మంత్రి పొన్నం