GPO Issues Resolution | జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. టీజీఎండీసీ ఛైర్మన్‌కు వినతి

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: GPO Issues Resolution | తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ పరిపాలన అధికారులు (జీపీవో) (GPO) కోరారు. ఈ మేరకు జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గొర్తె రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) (TGMDC) ఛైర్మన్ అనిల్ ఈరవత్రిని(Anil Eravathri) కలిసి వారు వినతిపత్రం సమర్పించారు.

GPO Issues Resolution | జీపీవోలదే కీలకపాత్ర..

గొర్తె రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న జీపీవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని ఛైర్మన్‌ను కోరారు. ఇందుకు టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీవోల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం పృథ్వీరాజ్, ధర్పల్లి మండల జీపీవో అధ్యక్షుడు తెప్ప రాజేష్, పడ్కాల్ జీపీవో అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Inspector Transfers | మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్ల బదిలీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *