అక్షరటుడే, కామారెడ్డి: GGH Constable Humanity | కామారెడ్డి(Kamareddy) జీజీహెచ్ పోలీస్ ఔట్ పోస్ట్ కౌంటర్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు మానవత్వం చాటారు. వివరాలు ఇలా ఉన్నాయి.
GGH Constable Humanity | క్షతగాత్రుడి వస్తువులు అందజేత
తాడ్వాయి(Tadwai) మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణ్ రావు సోమవారం నిజామాబాద్‌లో ఫంక్షన్‌కు వెళ్లాడు. తిరిగి బైక్‌పై కామారెడ్డికి వస్తుండగా గన్నారం ప్లాంట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో పాటు ఒక కాలు విరిగింది. ప్రమాదంలో సృహ కోల్పోవడంతో అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు(Kamareddy GGH) తరలించారు. ఆస్పత్రిలో అతనికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే లక్ష్మణ్ రావు వద్ద ఉన్న పర్సులో 3 తులాలు బంగారు పుస్తెల తాడు, రూ.2,550 నగదు ఉండగా వాటిని జాగ్రత్త చేసిన కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు.. బాధితుడి కొడుకు గోపిరావుకు అందజేశారు.
ఇది కూడా చదవండి: ఇండోనేషియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం